ఒక ఉద్యాయనవనంలో ముగ్గురు రాజ కుమార్తేలు కూర్చొని ఉన్నారు. వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయన్న ప్రశ్న ఒకసారి తలెత్తింది. ఆ ముగ్గురూ తన చేతులే మిగతా ఇద్దరికంటే చాలా అందంగా ఉన్నాయని తమలో తాము అనుకోసాగారు.
అప్పుడే అక్కడికి ఒక దేవెకన్య బిచ్చమెత్తుకునే అమ్మాయి రూపంలో వచ్చింది. ఇ రాచకన్యలు తమ తమ విలువైన దుస్తులను సర్దుకుని ముఖాలను పక్కకు తిప్పేసుకున్నారు. అక్కడ నుండి ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న పూరిల్లు చేరింది. ఆ పూరింట్లో ఉన్న నిరుపేద స్త్రీ ఆ అమ్మాయికి అన్నం పెట్టి, మంచినీళ్లు అందించింది.
మారువేషంలో ఉన్న ఆ దేవకన్య ఆ స్త్రీని ‘‘ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లు’’ అని ఆశీర్వదించింది. ఆ స్త్రీని ఆ అమ్మాయి అలా ఆశీర్వదించడం ఈ ముగ్గురు రాచకన్యలు చూస్తూ ఉండిపోయారు. బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆ దేవకన్య తన నిజరూపం ధరించి తన తోటివారికి సహాయపడడానికి సిద్దంగా ఉన్న చేతులే అతి సుందరమైన చేతులు అని ఆ ముగ్గురుతో చెప్పి ఆ దేవకన్య కనుమరుగైపోయింది.
ఇతరులకు సహాయ పడడంలోనే సుందరము ఆనందం, గొప్పతనం ఉన్నది.
ఈ కథలోని నీతి : ఇతరులకు సహాయపడే మనసు పేదవారికి దానం చేసే చేతులేగొప్పవి.
మరింత సమాచారం తెలుసుకోండి: